స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను జైలులో ఉంచడం సరికాదని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నామన్న సిద్ధార్థ లూథ్రా, హౌస్ అరెస్ట్ పిటిషన్పై వాదనలు వినిపిస్తామని చెప్పారు. ట్రయల్ కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం తక్కువని, హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేస్తామని తెలిపారు.