స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయనకు ఇంటి వద్ద నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది. ఇందులో భాగంగా చంద్రబాబుకు అల్పాహారంగా సిబ్బంది నేడు ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లింది. చంద్రబాబు కు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో ఫ్రూట్ సలాడ్‌ను కుటుంబ సభ్యులు అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ సిబ్బంది తీసుకెళ్లారు.