ఏలూరు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు, బంద్ కు అనుమతి లేదని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో బస్సుల రవాణాకు ఆటంకాలు, నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మేరి ప్రశాంతి హెచ్చరించారు. ప్రజల సాధారణ జన జీవనానికి, రాకపోకలకు బలవంతంగా ఎలాంటి అసౌకర్యం కలిగించినా చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చి అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు.