చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్ లో సోమవారం గుంటూరు పశ్చిమ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నేతల ఆందోళన చేపట్టారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టిడిపి, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.