తాను జైలుకు వెళ్ళాడు కాబట్టి అందరూ జైలుకు వెళ్లాలనేలా జగన్ తీరు ఉంది అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రత్యర్థులందరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర దౌర్భాగ్యం ఏమిటంటే ఆర్థిక నేరాల్లో 16 నెలలు జైలులో ఉండి.. బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి. చట్టాలు సంపూర్ణంగా పని చేసి ఉంటే జగన్ అనే వ్యక్తి జన్మలో ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు అన్నారు. రాష్ట్రానికి ఇవి చీకటి రోజులు, ప్రజలందరూ మేల్కోవలసిన సమయం ఆసన్నమైంది అని పిలుపునిచ్చారు.