అహంకారంతో పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదేనని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పాలకుడు అవినీతిపరుడైతే నీతిమంతులు జైలు పాలవుతారు అనడానికి చంద్రబాబు రిమాండే నిదర్శనం అన్నారు. ఈడీ కేసుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రొమ్ము విరిచి నిలబడలేదేం సజ్జలా? కేసుల విచారణకు హాజరుకాకుండా తప్పుడు ఛార్జ్షీట్లు వేస్తూ జగన్రెడ్డి ఎందుకు తప్పించుకుంటున్నాడు? పోలీసులను దారుణంగా ధూషించిన మంత్రులు, వైసీపీ నేతల సజ్జలకు గుర్తులేరా? వైసీపీ ప్రభుత్వానికి వత్తాసు పలికే పనిచేసే పోలీసు అధికారులపై టీడీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. అని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.