శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా బంద్ కొనసాగుతోంది. టెక్కలిలో హైవేపై టీడీపీ నేతలు బైఠాయించి నిరసనకు దిగారు. ఇదేమి రాజ్యం - ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. టెక్కలి పోలీసు పహారాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. దొరికిన వారిని దొరికినట్లు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa