చంద్రబాబు అరెస్టుపై ప్రభుత్వం మీద, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద టీడీపీతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి ఏవేవో నిందలేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ సీఐడీ చేయరాని పని ఏదో చేసినట్లుగా.. వైయస్ జగన్ ప్రభుత్వం ఏదో తమ నాయకుడ్ని కావాలని అరెస్టు చేసిందంటూ ఎవరికి వారు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. ఏ ప్రభుత్వమైనా ఒక వ్యక్తి దొంగతనం చేసినా.. మోసానికి పాల్పడినా.. ప్రజాధనాన్ని దోచుకుని నేరానికి పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక దొంగతనానికి పాల్పడి, ప్రజాధనం దోచుకుని స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు కాబట్టే అరెస్టు అయ్యాడని అన్నారు.