రైల్వే ప్రయాణికులకు సత్వర న్యాయం అందించడానికి, పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యూనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం ఎం. రామకృష్ణ. అన్నారు. గుంటూరు పట్టణం అరండల్పేటలోని రైల్వేకోర్టులో సోమవారం నిర్వహించిన లోక్ అదాలత్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 11 నుంచి 14వ తేదీవరకు లోక్ అదాలత్ కొనసాగుతోందన్నారు.