తెనాలి పట్టణంలోని నందులపేటకు చెందిన ఫోటోగ్రాఫర్ మల్లి తెనాలి నుండి తన కుమారుడు దీపక్ సాయితో పాటు మరో ఇద్దరు ఫొటో వీడియోగ్రాఫర్లతో కలిసి ఓ శుభకార్యం నిమిత్తం హైదరాబాద్ కు కారులో వెళ్లారు. ఫంక్షన్ ముగించుకుని తిరిగి తెనాలి వస్తుండగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. వీరి కారును డీసీఎం లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో మల్లి మృతి చెందాడు.