సోమవారం కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన "మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం - పర్యావరణాన్ని కాపాడుదాం" ప్రచార పోస్టరును కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వినాయక చవితి పండుగలో మట్టితో చేసిన వినాయకుని ప్రతిమను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించరాదని కోరారు. కార్యక్రమంలో జేసీ జి. రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.