ఉమ్మడి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మురళీమోహన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఐదు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేశారు. దీనితో ఇన్ఛార్జి మురళి, మండల పార్టీ కన్వీనర్ దొరబాబు చౌదరి తదితరుల మీద పోలీసులు కేసు నమోదు చేసి, పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. సోమవారం రాత్రి చిత్తూరు ప్రధాన ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి మురళి తదితరులకు వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి చిత్తూరు సెకండ్ ఏడీఎం జడ్జి వద్దకు తీసుకెళ్లి రిమాండ్ రిపోర్టును అందించారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన పిమ్మట కోర్ట్ సోమవారం రాత్రి 10.30 గంటలకు బెయిల్ మంజూరు చేశారు.