శ్రీకాకుళం జిల్లా, టెక్కలి భూలోకమాతవీధిలో నివాసముంటున్న బాడా ధర్మేంద్ర(57) స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పువ్వులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య జానకి, ఇద్దరు కుమారులు ప్రేమ్, సుమిత్‌లు ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ధర్మేంద్ర తన భార్య జానకితో గొడవపడుతుండగా.. పెద్దకుమారుడు ప్రేమ్ కలుగజేసుకుని తండ్రితో వాదించాడు. ఈ క్రమంలో ఆవేశంతో ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో తండ్రి తలపై దాడిచేశాడు. దీంతో ధర్మేంద్ర తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో ధర్మేంద్ర మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. దాడికి పాల్పడిన ప్రేమ్‌ను టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.