మచిలీపట్నంలో ధాన్యం కొనుగోలుకు సంబందించి ప్రణాళికను తయారు చేసుకుని మిల్లర్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. సోమవారం జేసీ అపరాజిత సింగ్‌తో కలిసి జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ధాన్యం కొనుగోలు సన్నద్ధత సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో ఏడునుంచి పదిలక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. మిల్లర్లు ముందస్తుగానే బ్యాంకు గ్యారంటీని సమర్పించాలన్నారు. గోనెసంచులు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం రవాణాచేసే వాహనాలకు జీపీఎ్‌సను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు ఎ.శ్రీధర్, జిల్లారై్‌సమిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు పిన్నమనేని వీరయ్య, మచిలీపట్నం డివిజన్ అఽధ్యక్షుడు సోమూరి కృష్ణాజీ, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు