స్కిల్ డెవల్‌పమెంట్ స్కాం పేరుతో దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపాడని, జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు జోలికి రావడం. దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. చంద్రబాబు.. ప్రజలు, రాష్ట్రం, దేశం గురించి తప్ప వేరేవాటి గురించి ఎప్పుడూ ఆలోచించని వ్యక్తి అని.. అవినీతి అనేది ఆయన రక్తంలోనే లేదని చెప్పారు. ‘దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరికీ తెలిసిన నేత. బిల్ గేట్స్‌ను అడిగినా, బిల్ క్లింటన్‌ను అడిగినా చంద్రబాబు ఒక బ్రాండని చెబుతారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది సైకో ప్రభుత్వం. చంద్రబాబుపై అవినీతి మరక వేయడానికి సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడని.. కానీ జనమెవరూ నమ్మడం లేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa