మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్ పోక్పై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు చనిపోయారు. ఇరెంగ్, కరమ్ వైపే గ్రామాల మధ్య మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను గిరిజన ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa