ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కొరకు చంద్రబాబు నాయుడు అప్లై చేసుకున్న విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్ పై విచారణను సెప్టెంబర్ 19కి కోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే క్వాష్ పిటిషన్ విచారణ 19కి, సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణ 18కి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో మరో 5 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండనున్నారు.