చంద్రబాబు రిమాండ్ పిటిషన్ కొట్టివేతపై ప్రభుత్వం వారం రోజులు సమయం కోరడం సాగదీత ధోరణే అని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోలేక ఎందుకు డొంక తిరుగుడుగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో నూకలు చెల్లినందున... ఎన్నికల్ని ఎదుర్కోలేక చేసే పిరికిపంద చర్యలివి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడి, ఏదో రకంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడి మళ్లీ గెలవాలనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో ఈ తరహా వ్యక్తిగత కక్షసాధింపు చర్యలు ఇప్పటి వరకూ లేవన్నారు. ముందుగా ఎన్నికలకు వెళ్లమని ఈనాడు చెప్పే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.