కేరళలో మళ్లీ నిపా వైరస్ ఉధృతమవుతోంది. ఈ వైరస్ సోకి కోళికోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందడం, మరో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. కోళికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడితో సహా నలుగురికి నిపా వైరస్ నిర్ధారణ కావడంతో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలను అధికారులు మూసివేశారు.