ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద తుఫాన్ వాహనం-లారీ ఒకదానికొకటి ఢీకొట్టుకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా అసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa