ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తమ బంధువును అంబులెన్స్‌లో తిరిగి తమ స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ డ్రైవర్ కాస్త నిద్రమత్తులో ఉండటంతో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. దీంతో అంబులెన్స్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్దారు. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం బెంగళూరు - తిరుపతి జాతీయ రహదారి తవణంపల్లి మండలం తెల్ల గుండ్లపల్లి వద్ద జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa