శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండవ రోజు సామూహిక నిరాహార దీక్షలను టిడిపి నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో దీక్షా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ పాలన సాగుతోందని తనకి ఇష్టం వచ్చినట్టుగా లేనిపోని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు ను జైల్లో వేయించారన్నారు.