కేరళ రాష్ట్రంలో ప్రాణాంతక నిఫా వైరస్ ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలను పరిశీలిద్దాం.. నిఫా వైరస్ గుర్తించడానికి 5 నుంచి 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధమైన సమస్యలు, లోబీపీ, అపస్మారక స్థితి, ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి, వాంతులు, అలసట, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.