ఓ కేసులో భార్య వేధిస్తుంటే లబోదిబోమన్న భర్తకు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది. ఈ జంట 2005లోనే వేరు పడగా కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో భర్త వేరే మహిళను పెళ్లి చేసుకోగా, భార్య ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నెల 13 నాటి తీర్పులో న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. విడాకులు రద్దు చేయాలన్న భార్య వాదనను తోసిపుచ్చింది. అత్తింటివారి పట్ల అగౌరవం, భర్తపై తరచూ క్రిమినల్ కేసులతో మనశ్శాంతి లేకుండా చేసిందని పేర్కొంది.