ఏపీ వ్యాప్తంగా శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను ప్రారంభించేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 30న తొలి హెల్త్ క్యాంప్ నిర్వహించే గ్రామాలు, పట్టణాల్లో రాష్ట్ర వైద్యశాఖ ఈ సర్వేకు శ్రీకారం చుట్టనుంది. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటికి పరిష్కారం చూపేందుకు చేపట్టిన ఆరోగ్య సురక్ష సర్వేలో భాగంగా బీపీ, షుగర్‌తోపాటు డెంగ్యూ, మలేరియా వంటి ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు.