ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత్కు మధ్య సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆ వెంటనే కెనడా ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడాలోని భారత ఇంటెలిజెన్స్ అధిపతిని బహిష్కరించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. తమ దేశ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై తమ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని ట్రూడో చెప్పారు.