హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కోసం హర్దీప్ సింగ్ నిజ్జర్ ఉద్యమించారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF)ను ఆయన స్థాపించారు. KTF కోసం యువకులను రిక్రూట్ చేసి, వారికి శిక్షణ ఇచ్చారు. పంజాబ్‌లోని లూథియానాలో 2007లో ఆరుగురు మృతి కేసుతో సహా పలు కేసుల్లో నిజ్జర్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఆయన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది.