ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కొత్త పార్లమెంట్ భవనానికి 'పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా'గా నామకరణం చేసింది. పార్లమెంటులో మధ్యాహ్నం కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' బిల్లు, ఈసీ కమిషనర్ల నియామక బిల్లులు ప్రవేశపెట్టే వీలుంది.