ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో ఆర్టీసీకి చెందిన ఇంద్ర బస్సు మంగళవారం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa