రాయలసీమ కోసం అహర్నిశలు తపించి, రాయలసీమ అభివృద్ధి శ్వాసగా తాను మరణించిన తర్వాత తన బూడిదను రాయలసీమ మొత్తం చల్లండి అని పిలుపునిచ్చిన రాయలసీమ స్టీరింగ్ కమిటీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆశయం నెరవేరాలని ఆర్ఏవీఎఫ్ జిల్లా సెక్రెటరీ ఖాజా ఆకాంక్షించారు. మంగళవారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. బైరెడ్డి రాయలసీమ కోసం చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు.