రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కడుపు నొప్పితో గవర్నర్ ఆస్పత్రిలో చేరగా, ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి అపెండిసైటిస్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రొబోటిక్ అపెండెక్టమీ సర్జరీ చేశామని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.