దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7వేల మంది టీడీపీ ఉద్యోగులు అందరికీ ఇళ్ల పట్టాలిచ్చి.. వాళ్లందరి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అన్నింటికన్నా సంతోషాన్నిచ్చే విషయమని సీఎం జగన్ తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ... ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా. దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు.