ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు ఒక ప్రకటనలో అన్నారు. చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.