సీఐడీ చీఫ్, డీజీపీలు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మండలంలోని చింతలపాలెం గ్రామ జాతీయ రహదారి వద్ద రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.