భారత దౌత్యాధికారిని బహిష్కరించిన కెనడాకు భారత్ షాక్ ఇచ్చింది. భారత్లో కెనడా రాయబారిని బహిష్కరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. భారత్లోని కెనడా రాయబారి కేమరూన్ మెక్కేను 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని సూచించింది. భారత వ్యతిరేక ఖలిస్తాన్ ఉగ్రవాద చర్యలకు కెనడా మద్దతిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది.