ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. హైకోర్టులో ఆయన తరుపున సుప్రీంకోర్టు లాయర్ లూథ్రా, వర్చువల్గా ఇంటర్నేషనల్ లాయర్ హరీశ్ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించనున్నారు.