లోక్సభలో 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదో ఎవరికీ తెలియని పరిస్థితి దేశంలో నెలకొందని, ఈ విషయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్షతో అరెస్ట్ చేసారని ఈ సందర్భంగా అయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యపాలు అవుతుంది అని ఆవేదన వ్యక్తపరిచారు.