నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం, మండలం లోని అన్ని గ్రామాల్లో బుధవారం వినాయక నిమర్జనం చేయనున్నారు. మూడు రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్యకు వీడ్కోలు పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. సామరస్యంగా నిమర్జన వేడుకలను జరుపుకోవాలని వారు సూచించారు.