తిరుమల, అలిపిరి కాలిబాట మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. మూడు నెలల వ్యవధిలో అలిపిరి నడక మార్గంలో ఆరు చిరుతలను అటవీ అధికారులు బంధించారు. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నేడు బోన్‌కు మరో చిరుత చిక్కింది. నేడు చిక్కిన చిరుత నమూనాని అధికారులు ల్యాబ్‌కి పంపనున్నారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతాంలోనే ఈ చిరుత చిక్కడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa