అక్టోబరు 15వ తేదీ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కనకదుర్గమ్మకు ఈసారి కొత్త అలంకారం చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారాన్ని తొలగించారు. ఆ స్థానంలో శుద్ధపంచమి అనగా 19వ తేదీన అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరిస్తారు. ఈ విషయాన్ని దుర్గామల్లేశ్వరస్వామి అధికారులు, ధర్మకర్తల మండలి, వైదిక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa