విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం నేటి నుండి 29వ తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో బైక్ యాత్రను చేపట్టనున్నట్లు సీపీఎం మన్యం జిల్లా కార్యదర్శి ఆర్.వేణు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... 800 రోజులుగా జరుగుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ పోరాటానికి ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో బైకు యాత్రతో పాటు సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతిరావు, గంగనాయుడు, మన్మథ రావు, ఇందిర, జీవీ రమణ, ఈశ్వరరావు, శ్రీదేవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa