మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా అటవీ కమిటీ, జిల్లా వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశాలు కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ... రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర సర్వే చేపట్టిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ అప్రమత్తతతో వ్యవహరించి అటవీ భూముల సరిహద్దులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇందుకు అటవీ, రెవిన్యూ, సర్వే, భూ రికార్డుల అధికారుల సంయుక్త బృందాలు కీలకంగా వ్యవహరించాలన్నారు.