విజయనగరం జిల్లా, గంట్యాడ మండలంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే....మండలంలోని పెద్దమజ్జిపాలెం గ్రామానికి చెందిన పైల అంజలి (28) భర్త రామకృష్ణతో గ్రామంలో జీవనం సాగిస్తోంది. రామకృష్ణ లారీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్కూల్కు వెళ్తున్న పిల్లలకు భోజనం అందించేందుకు వంట చేసే క్రమంలో పెరటిలో ఉన్న కరి వేపాకు తీస్తుండగా గుర్తు తెలియని పాము ఆమెను కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు పీహెచ్సీలో చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.