ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి (M) ఉప్పలపాడులో అనూహ్య ఘటన జరిగింది. పాఠశాల బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అద్దంకికి చెందిన ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ గుర్రాల ఏడుకొండలు(53) మైలవరం, ఉప్పలపాడు నుంచి 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వస్తుండగా ఉప్పలపాడు వద్ద డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలాడు. స్థానికులు గమనించగా డ్రైవర్ అప్పటికే మృతి చెందాడు. ఆ సమయంలో పాఠశాల బస్సు రోడ్డు మధ్యలో ఆగడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు.