లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని, వెంటనే కులగణన చేసి బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ అందించారన్నారు. పీవీ నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అమలు చేసిందన్నారు. అందువల్లే దేశంలో 15 లక్షల మంది మహిళలు అధికారాన్ని దక్కించుకున్నారన్నారు.