రైలు మార్గాల్లో మరమ్మతులు చేపట్టనున్న కారణంగా విల్లుపురం - తిరుపతి- విల్లుపురం రైళ్లు ఈ నెల 24వ తేది వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, విల్లుపురంలో ఉదయం 5. 30 గంటలకు బయల్దేరే రైలు తిరుపతికి బదులు కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది. అలాగే, మధ్యాహ్నం 1. 50 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన రైలు తిరుపతికి బదులు కాట్పాడి నుంచి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.