మదనపల్లి విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు బుధవారం విజయభారతి విద్యాసంస్థల అధినేత డా. ఎన్. సేతు, బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ ఆధ్వర్యంలో మెగా గుండె వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. సుమారు 600 మందికి పైగా గుండె వైద్యచికిత్సలు పొందారు. ఈ సందర్భంగా డా. ఎన్. సేతు పిటీఎం శివ ప్రసాద్ మాట్లాడుతూ. గుండె వైద్యంలో ప్రఖ్యాంత గాచిన నారాయణ హృదయాలయ డాక్టర్ల ఆధ్వర్యంలో గుండె వైద్య శిబిరం నిర్వహించారు.