పెడన పట్టణం బుదవారం వైసిపి కార్యలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పై 70 ఎం ఎం సినిమా వేసి చూపిస్తామని ఎద్దెవా చేశారు. నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి మాట్లాడటం కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని మండిపడ్డారు.