మైలవరం పట్టణంలో బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. విజయవాడ సబ్ కలెక్టర్ అజిత్ సింగ్, జెసి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు తమ సమస్యలను అధికారులు దృష్టికి తెచ్చారు. మైలవరం ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.