వీరులపాడు మండలంలోని జుజ్జూరు రంగాపురం గ్రామంలో గడపగడపకు, మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలమని, సంక్షేమ రారాజుగా సీఎం జగనన్న ఖ్యాతి గడించారని తెలిపారు.